Abn logo
Aug 7 2020 @ 12:19PM

బ్రేకింగ్: అజ్ఞాతం వీడి ఈడీ ఆఫీస్‌కు రియా చక్రవర్తి

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసును బీహార్ పోలీసులు విచారణ చేస్తున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో శుక్రవారం ప్రత్యక్షమైంది. రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందని, సుశాంత్‌ను రియా మానసికంగా ఎంతో వేదనకు గురిచేసిందని సుశాంత్ తండ్రి రియా చక్రవర్తిపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ ఈ కేసుపై దృష్టి సారించింది.


రియాకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు పంపింది. అయితే.. సుప్రీంలో తన పిటిషన్ తదుపరి విచారణకు వచ్చేవరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్‌ను వాయిదా వేయాలని రియా కోరింది. ఈ అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఇవాళ ఉదయం 11.30 లోపు రియా హాజరుకావాలని.. లేనిపక్షంలో మళ్లీ తాజాగా సమన్లు జారీ చేస్తామని ఈడీ స్పష్టం చేసింది. దీంతో.. చేసేదేమీ లేక ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆఫీస్‌కు రియా హాజరయింది.


Advertisement
Advertisement
Advertisement