Abn logo
Jun 6 2020 @ 23:07PM

‘ఆర్ఆర్ఆర్’పై బాంబ్ పేల్చిన ఆర్జీవీ

వర్మ ఏది చేసినా సంచలనమే. అందుకే ఆయన గురించి ఏం చెప్పాలన్నా.. సంచలన దర్శకుడు అని మొదలెడతారు. ఆ సంచలన దర్శకుడు ఇప్పుడు సంచలన కామెంట్స్ చేశారు. వర్మకి ఓ అలవాటు ఉంది. అదేమంటే ఫ్రీ పబ్లిసిటీ. తన సినిమా ఏదైనా విడుదలకు రెడీగా ఉన్నా.. లేదా ప్రమోషన్స్ జరగాల్సిన టైమ్ వచ్చినా.. సడెన్‌గా వర్మ టీవీల ముందు వాలిపోయి.. ఏవేవో కామెంట్స్ చేస్తారు. లేదంటే ట్విట్టర్‌లో తనకు సంబంధమే లేని విషయాలను కెలికి అగ్గి రాజేస్తారు. ఆ తర్వాత వర్మ చలి కాచుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆయన అనుకున్నది సాధించాకే మళ్లీ కొన్ని రోజులు కామ్‌గా ఉంటారు. మళ్లీ రొట్టె దొరకగానే గేమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు వర్మ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటికి ప్రమోషన్ కావాలి. ఇక స్టార్ట్ చేశాడు. 


తాజాగా ఆయన ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ఓ బాంబ్ పేల్చాడు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్న రాజమౌళి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఫ్లాప్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగేతే ఇండస్ట్రీలో పార్టీ చేసుకునే వాళ్లు కూడా ఉన్నారంటూ తనకే సాధ్యమైన తరహాలో మాట్లాడి బాంబ్ పేల్చాడు. మరి ఆ పార్టీ చేసుకునే వాళ్లు ఎవరంటే మాత్రం వర్మ చెప్పలేదు. మొత్తానికి ఏదైతేనేం.. వర్మ అనుకున్నది మాత్రం సాధించాడు.

Advertisement
Advertisement
Advertisement