Abn logo
Jul 13 2020 @ 11:30AM

యాక్ట‌ర్‌గా ఆర్జీవీ.. ఎవ‌రి పాత్ర చేస్తున్నాడంటే?

సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌డం, ప్రొడ్యూస్ చేయ‌డం చేసే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త్వ‌ర‌లోనే న‌టుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నాడా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ నుండి వినిపిస్తోంది. వివ‌రాల్లోకెళ్తే ప్ర‌స్తుతం ఆర్జీవీ ‘ప‌వ‌ర్‌స్టార్‌’ అనే సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో న‌టీన‌టులంద‌రూ ఇప్ప‌టి హీరోలైన చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పోలి ఉన్నారు. తాను ఎవ‌రిని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నానో వ‌ర్మచెబుతూనే నాకేం సంబంధం లేద‌ని అంటున్నాడు. ఈ సినిమాలో కొన్ని పాత్ర‌లు నిజ జీవిత పాత్ర‌ల‌ను పోలిన‌ట్లు ఉండ‌బోతున్నాయ‌ట‌. అందులో క‌మెడియ‌న్‌గా స్టార్ట్ అయ్యి నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేశ్ పాత్ర కూడా ఉండ‌బోతుంద‌ట‌. ఈ పాత్ర‌ను ఆర్జీవీ పోషించ‌బోతున్నాడ‌ని టాక్‌. ‘అన్నా.. నువ్వు దేవుడివన్నా, వచ్చే ఎన్నికల్లో విజయం మనదే.. నీకు తిరుగులేదు’ అంటూ డైలాగ్‌తో బండ్ల గ‌ణేశ్ పాత్ర‌లో ఆర్జీవీ సంద‌డి చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement