Oct 17 2021 @ 15:49PM

RGV: సర్కస్‌ని తలపించిన ‘మా’ ఎన్నికలు!

‘మా’ ఎన్నికల పేరుతో ఎన్నో విషయాలు తెరపైకి వచ్చాయి. లోకల్‌, నాన్‌లోకల్‌ అంటూ ఎప్పుడూ లేని కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. విమర్శలు, ఆరోపణలు, అంతకుమించి వ్యక్తిగత దూషణల నడుమ ‘మా’ ఎన్నికలు ముగిశాయి. శనివారం జరిగిన ప్రమాణ స్వీకారంలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘మా’లో జరుగుతోన్న ఈ పరిణామాలపై వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ స్పందించారు. ఈ మేరకు ఆయనొక ట్వీట్‌ చేశారు.  ‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ, సిని’మా’ వాళ్లు సర్కస్‌ లాంటి వాళ్లని ప్రజలకి నిరూపించారంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.  ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.