వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేసే సినిమాల కంటే అనౌన్స్ చేసే సినిమాల సంఖ్యే ఎక్కువ. తాజాగా ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో మరో వివాదాస్పద చిత్రాన్ని అనౌన్స్ చేశారు. లెస్బియన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఆర్జీవీ ‘డేంజరస్’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఆర్జీవీ తెలిపారు. అప్సర రాణి, నైనా గంగూలీ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ’’ఇదొక ఎపిక్ ఎమోషనల్ లవ్‌స్టోరి. ఇద్దరు మహిళల మధ్య కొనసాగే ప్రేమ. వారి మధ్య ఒకరినొకరు చంపుకునేంత ప్రేమ, చచ్చేంత ప్రేమ ఉంది. స్వలింగ సంపర్కులకు సంబంధించిన సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అప్సర రాణి, నైనా గంగూలీకి అభినందనలు. వారు న్యూ ఏజ్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నారు’’ అని ఆర్జీవీ తెలిపారు.