16,17తేదీల్లో ఆర్‌జీయూకేటీ సెట్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-04-13T08:14:21+05:30 IST

ఆర్‌జీయూకేటీ సెట్‌-2020 ద్వారా ఆఫర్‌ చేస్తున్న వెటర్నరీ, డెయిరీ, ఫిషరీ, అగ్రి, ఉద్యానవన డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

16,17తేదీల్లో ఆర్‌జీయూకేటీ సెట్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 12: ఆర్‌జీయూకేటీ సెట్‌-2020 ద్వారా ఆఫర్‌ చేస్తున్న వెటర్నరీ, డెయిరీ, ఫిషరీ, అగ్రి, ఉద్యానవన డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో గుంటూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫారంలో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ డీన్‌ డాక్టర్‌ టీఎస్‌ చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష రాసి, ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2021-04-13T08:14:21+05:30 IST