Abn logo
Dec 5 2020 @ 23:44PM

ప్రశాంతంగా ఆర్‌జీయూకేటీ సెట్‌

97 శాతం హాజరు

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 5 : ఆర్‌జీయుకేటీ సెట్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 97 శాతం మంది హాజరయ్యారు. జిల్లాలో ట్రిపుల్‌ఐటీ ప్రవేశానికి సంబంధించి పరీక్ష శనివారం జరిగింది. జిల్లాలోని 40 మండలాల్లో 67 కేంద్రాలు ఏర్పాటు చేయగా 9440 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షకు 9202 మంది (97 శాతం) హాజరయ్యారు. 239 మంది గైర్హాజరయ్యారు. ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతి నిషేధం ఉన్న నిబంధన మేరకు విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షకు 97 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈవో పి.శైలజ తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే కొవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించామన్నారు. కడప నగరంలో ఆరు కేంద్రాలను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement