Abn logo
Sep 26 2021 @ 23:23PM

ప్రశాంతంగా ఆర్జీయూకేటీ సెట్‌

పరీక్ష నిర్వహణ తీరును పరిశీలిస్తున్న డీఈవో రమేష్‌

నెల్లూరు (విద్య) సెప్టెంబరు 26 : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాల యం పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం జిల్లాలో నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. విద్యాశాఖ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.  మొత్తం 4,262 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,120 మంది హాజరయ్యారు.  142 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును డీఈవో రమేష్‌, జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి రామారావు పర్యవేక్షించారు.