ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆర్‌జీ-1 జీఎం

ABN , First Publish Date - 2021-05-08T05:00:05+05:30 IST

స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ శుక్రవారం సందర్శించారు.

ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆర్‌జీ-1 జీఎం
ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జీఎం నారాయణ

గోదావరిఖని, మే 7: స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ శుక్రవారం సందర్శించారు. ఆ సుపత్రిలో వ్యాక్సినేషన్‌ రిజ్రిస్టేషన్‌ గది, వ్యాక్సినేషన్‌ జరుగుతు న్న వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ రోజుకు కేటాయించిన కోటాను ఖచ్చితంగా ఉద్యోగులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైనా ఉద్యోగులు వ్యాక్సిన్‌ తీసుకోలేదో వారి బదులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న మరో ఉద్యోగికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని, వ్యాక్సిన్‌ చేసుకోని ఉద్యోగిని అందుబాటులో ఉంచుకుని వ్యాక్సినేషన్‌ రోజువారి కోటాను తప్పనిసరిగా ఉద్యోగులు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి గనుల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ సిలిండర్ల లభ్యత, కొవిడ్‌ పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్‌ డీవైసీఎంఓ ను అడిగి తెలుసుకున్నారు.  అలాగే సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా మూతపడిన పవర్‌హౌస్‌లో ఏర్పా టు చేయనున్న ఆక్సిజన్‌ ప్లాంట్‌పై ఆర్‌జీ-1 ముందస్తు చర్యలను చేపట్టారు. శుక్రవారం ముస్త్యాల గ్రామ రహదారిలో ఉన్న ఆక్సిన్‌ ప్లాంట్‌ను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌, ఆక్సిజన్‌ తయారీ, సిలిండర్లలో ఫిల్లింగ్‌ చేసే విధానాన్ని జీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్‌ రాం మూర్తి, ఎన్విరాన్‌మెంట్‌ అధికారి ఆంజనేయప్రసాద్‌, సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, సివిల్‌ సూపర్‌వైజర్‌ యుగేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T05:00:05+05:30 IST