నియామకాల ఆరోపణలపై నోరువిప్పిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌

ABN , First Publish Date - 2022-08-14T06:50:09+05:30 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌లో నియామకాల్లో హెచ్‌ఆర్‌ విభాగంపై వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు యాజమా న్యం నోరు విప్పింది.

నియామకాల ఆరోపణలపై నోరువిప్పిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌
ఇన్‌చార్జి జీఎం ఎస్‌కే ఝా

- నియామకాలకు తమకు సంబంధం లేదని ఉద్ఘాటన

కోల్‌సిటీ, ఆగస్టు 13: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌లో నియామకాల్లో హెచ్‌ఆర్‌ విభాగంపై వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు యాజమా న్యం నోరు విప్పింది. ఫైవ్‌ స్టార్‌ కాంట్రాక్టు వద్ద సబ్‌ కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తులతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారా యణ సైతం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యానికి, కాంట్రాక్టు నియామకాల్లో సంబంధాలపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ యాజమాన్యం ఎట్టకేలకు నోరు విప్పింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం పక్షాన ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ ఎస్‌కే ఝా శనివారం ఒక ప్రకటన విడుద ల చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యంపై వచ్చిన ఆరోప ణలను తీవ్రంగా ఖండిస్తున్న ట్టు పేర్కొన్నారు. ఇవి నిజం కాదని, కంపెనీ పరువు తీయాలని ఉద్దేశపూర్వకంగా స్వార్థపూరిత ఉద్దేశంతో చేయబడ్డాయన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్టు వర్కర్‌, లేబర్‌గా నియామకాలు పూర్తిగా కాంట్రాక్టర్‌కు సంబంధించిన బాధ్యత అని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పాత్ర ఏమి ఉండదన్నారు. ఈ ఆరోపణల ను ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తీవ్రంగా పరిగణిస్తుందని, దీనిని నిలు వరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా కీలక పాత్ర పోషిస్తుంద న్నారు. తెలంగాణ తో పాటు పలు రాష్ట్రాలకు సకాలంలో యూరియాను  అందించడమే తమ ముందున్న లక్ష్యంగా ఎస్‌కే ఝా పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-14T06:50:09+05:30 IST