Abn logo
Apr 11 2021 @ 01:14AM

రేవంత్‌కు కేసీఆర్‌ గురించి మాట్లాడే అర్హత లేదు

 ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
పెద్దవూర / గుర్రంపోడు / నాగార్జునసాగర్‌ / మాడ్గులపల్లి, ఏప్రిల్‌ 10 :
సీఎం కేసీఆర్‌ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. పెద్దవూర మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రా పాలకులకు చెంచాగిరి చేసిన ఆయనది టీఆర్‌ఎస్‌ పార్టీ గురించి మాట్లాడే స్థాయి కాదన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి బ్లాక్‌మెయిలర్‌గా మారి కోట్లు ఎలా సంపాదించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 2018లో కొండగల్‌ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా సిగ్గు రాలేదన్నారు. కొండగల్‌లో ఓడగొడితే మల్కాజిగిరిలో పడ్డావని, అక్కడ ప్రజలు ఈసారి ఓడిస్తే ఏడపడతావో తెలియదనారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లింది రేవంత్‌ అయితే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైలుకెళ్లింది తామన్నారు. మైక్‌ దొరికిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. గల్లీలో, ఢిల్లీలో లేని మీ పార్టీల గురించి ఇక్కడేం మాట్లాడినా కుదరదన్నారు. సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్ను అనురాధ, మండ ల అధ్యక్షుడు రవినాయక్‌, లింగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, లింగయ్య, షేక్‌ అబ్బాస్‌, మిట్లపల్లి శ్రీనివాస్‌, శ్రీనివా్‌సరాజు, బషీర్‌ పాల్గొన్నారు. గుర్రంపోడు మండలంలోని కొప్పోల్‌ గ్రామంలో 50 ఎస్టీ కుటుంబాలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరాయి. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, గాలి రవికుమార్‌, పాశం గో పాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆవుల వెంకన్న పాల్గొన్నారు. సాగర్‌ పైలాన్‌ కాలనీలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దూదిమెట్ట బాలరాజు ప్రచారం చేశారు. సాగర్‌ హిల్‌కాలనీలో 2,3వార్డుల్లో నందికొండ ఇన్‌చార్జి సునీల్‌రావు కోరారు. మాడ్గులపల్లి మండలంలోని గజలాపురంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుక్కమూడి చామంతి, కృష్ణయ్య పాల్గొన్నారు.
కులవృత్తులకు ఆదరణ : ప్రకాష్‌
హాలియా : తెలంగాణలో కులవృత్తులను ఆదరించిన ఘనత సీఎం కేసీఆర్‌దని ఎంపీ బండా ప్రకాశ్‌ అన్నారు. శనివారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కుల వృత్తులకు ఆర్థిక చేయూత కల్పించడానికి సానుకూల అవకాశాలు కల్పించారని, మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేశారని, అదేవిధంగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఆత్మగౌరవ భవనాలు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. మత్స్యకారులకు రూ.700కోట్లతో వాహనాలు సమకూర్చారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సామాజిక అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడారి అంజయ్యయాదవ్‌, ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, యువజన విభాగం నాయకులు పల్లె అశోక్‌, బైరు శంకర్‌, సొప్పరి సోమయ్య, ఉప్పరబోయిస్వామి, వెలుగు రవి, వెంకట్‌, బలరాం పాల్గొన్నారు.

Advertisement
Advertisement