పోలింగ్‌ కేంద్రాల నిర్వహణపై సమీక్ష

ABN , First Publish Date - 2021-09-29T05:59:37+05:30 IST

ఏటా రేషనలైజేషన కార్యక్రమంలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ, వాటి అమలు తీరుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నూతన ఆర్డీఓ వరప్రసాదరావు మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు.

పోలింగ్‌ కేంద్రాల నిర్వహణపై సమీక్ష
ధర్మవరంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన ఆర్డీఓ



ధర్మవరం, సెప్టెంబరు 28 : ఏటా రేషనలైజేషన కార్యక్రమంలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ, వాటి అమలు తీరుపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నూతన ఆర్డీఓ వరప్రసాదరావు మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్‌స్టేషన్ల విభజన, పునర్విభజన, చేర్పులు, మార్పులు, తొలగింపులు, నూతన పొలింగ్‌స్టేషన్ల ఏర్పాటు తదితర వాటిపై చర్చించారు. నియోజకవర్గంలోని తాడిమర్రిలో 3, ముదిగుబ్బలో 2 పోలింగ్‌ కేంద్రాలను తొలగించడానికి  నాయకులు సమ్మతించారు. అనంతరం రాజకీయ నాయకుల సలహాలు, సూచనలు, సర్దుబాటు, ఓటర్ల జాబితా తదితర వాటిపై చర్చించారు. సమావేశంలో తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి, నాయకులు పురుషోత్తంగౌడ్‌, అరవిందరెడ్డి, గొట్లూరుచంద్ర, జింకాచలపతి, మధు, సాకే ఓబుళేశు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T05:59:37+05:30 IST