ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

ABN , First Publish Date - 2021-04-13T06:07:29+05:30 IST

జిల్లాలో ఊపందుకోని ధా న్యం కొనుగోళ్లు అనే కథ నం ఆంధ్రజ్యోతిలో రావడంతో జిల్లా యంత్రాంగం స్పం దించింది.

ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12: (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో ఊపందుకోని ధా న్యం కొనుగోళ్లు అనే కథ నం ఆంధ్రజ్యోతిలో రావడంతో జిల్లా యంత్రాంగం స్పం దించింది. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అధి కారులతో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. మండలస్థాయి అధికారులతో సెల్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని గ్రామాల పరిధిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు తూకం సమయంలో తరుగు తీయద్దని కోరారు. ఎక్కడ రైతులకు ఇబ్బందులు లేకుం డా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సహకార, పౌరసరఫరాల శాఖ, అధికారులు సింహాచలం వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. ఏ సమస్యలున్న వెంటనే సమాచారం ఇస్తే గన్నీ బ్యాగులతో పాటు వాహనాలను సమకూరుస్తామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని వారు కోరారు. 

Updated Date - 2021-04-13T06:07:29+05:30 IST