‘ఇంధనం’పై రెండు వారాలకో సమీక్ష

ABN , First Publish Date - 2022-07-01T20:52:58+05:30 IST

ముడిచమురు(డీజిల్, ATF) పై ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు కొత్త సుంకాల విషయమై సమీక్షించనుంది.

‘ఇంధనం’పై రెండు వారాలకో సమీక్ష

న్యూఢిల్లీ : ముడిచమురు(డీజిల్, ATF) పై ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు కొత్త సుంకాల విషయమై సమీక్షించనుంది. అంతర్జాతీయ ధరల ప్రాతిపదికన  ముడిచమురు, డీజిల్, ఏటీఎఫ్‌లపై విధించే కొత్త పన్నులను ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్షిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వెల్లడించారు. కాగా... చమురుకు సంబంధించి... ప్రస్తుత పరిస్థితిని ‘అసాధారణ సమయం’గా ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే... పెట్రోల్, ATF ఎగుమతులపై లీటరుకు రూ. 6, డీజిల్ ఎగుమతిపై రూ. 13 చొప్పున పన్ను...ఈ రోజు(జూలై 1, శుక్రవారం) నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదనంగా... దేశీయంగా ఉత్పత్తవుతున్న ముడిచమురుపై టన్నుకు రూ. 23,250 చొప్పున  పన్ను ఉంటుంది. 

Updated Date - 2022-07-01T20:52:58+05:30 IST