Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

విజయవాడ: దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో శనివారం దసరా కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అన్ని శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు. మరోవైపు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement
Advertisement