Review meeting: వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం

ABN , First Publish Date - 2022-08-06T00:58:31+05:30 IST

Amaravathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. విత్తనాల నాణ్యతపై

Review meeting: వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం

Amaravathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని, సెప్టెంబరు మొదటివారంలోగా ఈ - క్రాపింగ్ (e - cropping) వందశాతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ - క్రాపింగ్ చేశాక భౌతిక రశీదు, డిజిటల్‌ రశీదు ఇవ్వాలన్నారు. ఈ - క్రాపింగ్ చేసినప్పుడు జియో ట్యాగింగ్‌, వెబ్‌ ల్యాండ్‌తో కూడా అనుసంధానం చేస్తున్నామన్న అధికారులు సీఎంకు వివరించారు. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులను  ఆదేశించారు. వ్యవసాయరంగంలో డ్రోన్ల (Drone) వినియోగంపై కూడా చర్చ జరిగింది. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇచ్చేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2022-08-06T00:58:31+05:30 IST