Abn logo
Apr 1 2020 @ 13:24PM

కరోనా ప్రభావంపై సమీక్షించిన రాజీవ్‌ గౌబ

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ బుధవారం సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా ప్రభావంపై ఆయన సమీక్షించారు. మర్కజ్‌ వ్యవహారం, వివిధ రాష్ట్రాల్లో కరోనా ప్రభావంపై ఆరా తీశారు. ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని, వలస కూలీలకు ఏర్పాట్లు అలసత్వం ఉండకూడదని ఆదేశించారు. లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని రాజీవ్‌గౌబ అధికారులకు ఆదేశించారు.

Advertisement
Advertisement
Advertisement