రివర్స్‌ పీఆర్సీ మాకు వద్దే వద్దు: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-01-19T05:23:08+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ వద్దని, ఉద్యోగుల జీవితాలతో ఆటలొద్దని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా అన్నారు.

రివర్స్‌ పీఆర్సీ మాకు వద్దే వద్దు: యూటీఎఫ్‌
పీఆర్సీ ప్రతులను దహనం చేస్తున్న యూటీఎఫ్‌ నేతలు

చెన్నూరు, జనవరి 18 : రివర్స్‌ పీఆర్సీ వద్దని, ఉద్యోగుల జీవితాలతో ఆటలొద్దని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా అన్నారు. ప్ర టభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీఓలను చెన్నూరు మండల విద్యా కేంద్రం వద్ద మంగళవారం యూటీఎఫ్‌ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టం కలిగించే పీఆర్సీ ఉత్తర్వులు అత్యంత హేయమైనవిగా భావిస్తున్నామన్నారు. పీఆర్సీ ఫిట్మెంట్‌ 27 శాతం కంటే అధికంగా ఉండాలని, పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు కొనసాగించాలని, సచివాలయ ఉద్యోగులను, కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ వారిని రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, వీరనారాయణ, మధుసూధన్‌రెడ్డి, చిన్నప్పటిరెడ్డి, గాయత్రిదేవి, అనురాధ, హైమావతి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:23:08+05:30 IST