‘విదేశీ విద్యార్థుల’పై నిర్ణయం వెనక్కు తీసుకోండి

ABN , First Publish Date - 2020-07-11T07:30:06+05:30 IST

‘విదేశీ విద్యార్థుల’పై నిర్ణయం వెనక్కు తీసుకోండి

‘విదేశీ విద్యార్థుల’పై నిర్ణయం వెనక్కు తీసుకోండి

వాషింగ్టన్‌, జూలై 10: కరోనా నేపథ్యంలో వర్శిటీలు పూర్తిగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు మారితే.. విదేశీ విద్యార్థులు అమెరికాను వదిలి వెళ్లాలంటూ ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని 136 మంది అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు, 30 మంది సెనేటర్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి సూచించారు. వీరిలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్‌ కమలా హ్యారిస్‌ కూడా ఉన్నారు. హోమ్‌ ల్యాండ్‌ భద్రతా విభాగం యాక్టింగ్‌ సెక్రటరీ చాద్‌ వూల్ఫ్‌, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) యాక్టింగ్‌ సెక్రటరీ మాథ్యూ అల్బెన్స్‌కు ఈ మేరకు వీరు గురువారం వేర్వేరుగా లేఖలు రాశారు. ఐసీఈ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై వీరంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విదేశీయుల పట్ల శత్రుత్వం పెంచేదిగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-11T07:30:06+05:30 IST