ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టండి

ABN , First Publish Date - 2022-08-06T05:24:40+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టండి

ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టండి
పూసపాటిరేగ: వెళ్దూరులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

- బాదుడే బాదుడులో టీడీపీ నాయకులు

మెరకముడిదాం: రాష్ట్ర ప్రభుత్వం అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పులిగుమ్మి, నరసయ్యపేట గ్రామా ల్లో శుక్రవారం మాజీ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు తాడ్డి సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిర్వహించారు. ఈ సంద ర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కర పత్రాలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, మళ్లీ చంద్రబాబును ముఖ్య మంత్రి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కెంగువ ధనుంజయ, చెల్ల శ్రీరాం, పిన్నింటి సన్యాసీనాయుడు పాల్గొన్నారు. 


వెళ్దూరు గ్రామంలో...

పూసపాటిరేగ: ధరలతో వైసీపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు అన్నారు. శుక్రవారం వెళ్దూరు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఇంటింటా ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకిరి ప్రసాదరావు, పార్టీ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు, నాయకులు ఇజ్జురోతు ఈశ్వరరావు, చందక ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 


రాష్ట్రంలో నేరగాళ్ల పాలన 

- టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ 

పాలకొండ: రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక నేరగాళ్లు, ఆకురౌడీల పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆరోపించారు. పట్ట ణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయ న విలేఖరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ రెడ్డి స్వతహాగా నేర స్వభావం ఉన్నవాడని, పార్టీలో కూడా నేరస్తులు, రేపిస్టులు, దొంగలకు ప్రాధా న్యతనిచ్చి పదవులు కట్టబెట్టారన్నారని ఆరోపిం చారు. గోరింట్ల మాధవ్‌ చేసిన గలీజ్‌ పనికి పార్లమెంట్‌లో తెలుగు రాష్ర్టాల ఎంపీలు సిగ్గు తో తలదించుకోవాల్సి వచ్చిందన్నారు.  మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అవంతి శ్రీనివాస్‌, అంబటి రాంబాబు, జోగి రమేష్‌పై చర్యలు తీసుకోకుండా ముంత్రి పదవు కట్టబెట్టడం దురదృష్టకరమన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు కుమార్తె పట్ల అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా మాట్లాడి యావత్‌ మహిళా జాతిని అవమానించిన కొడాలి నాని, వల్లభనేని వంశీలపై కనీసం చర్యలు తీసుకోకపోగా వాళ్ల బూతులు వింటూ జగన్‌రెడ్డి రాక్షసానందం పొందారన్నారు. మహిళలను లైంగికంగా వేధించిన గోరంట్ల మాధవ్‌ వంటి క్రిమినల్స్‌కు పార్లమెంట్‌లో ఉండే అర్హత లేదని, తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు గండి రామినాయుడు, టీఎన్‌టీయూసీ నివర్తి శశి, నాయకులు కోట సంగంనాయుడు, సిరిపురపు జగదీష్‌, రమేష్‌, రాగోలు దావీదు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


మహిళలకు రక్షణ కరువు

- టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి

నెల్లిమర్ల: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె పార్టీ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ బేగంతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఎంపీ గోరింట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం దురదృష్టకరమన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఈ దాడులు ఎక్కువయ్యాయన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించేవారిరిపై కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.  


వైసీపీలో నేరస్థులే అధికం

- మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు

పార్వతీపురం రూరల్‌: వైసీపీ లో అత్యధికంగా రేపిస్టులు, నేరస్థు లే నాయకులుగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆరోపించారు. కృష్ణపల్లిలో ఆయ న విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదని, రాసలీలల పార్టీ అని దుయబట్టారు. ఆర్థిక నేరాల నుంచి ఆకు రౌడీల వరకు వైసీపీ పునరావాస కేంద్రంగా మారిందని ఆరో పించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రవర్తతో పార్లమెంట్‌లో తెలుగు రాష్ట్రాల పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  వైసీపీ అంటే యువజన శృంగార పిచాశుల పార్టీ అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.  కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ రెడ్డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 


వైసీపీవి నీచ రాజకీయాలు

- ఎన్టీఆర్‌ కుమార్తె మృతిపై విష ప్రచారం తగదు

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి 

సాలూరు: రాష్ట్రంలో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించా రు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై విష ప్రచారం చేయడం జగన్‌ రెడ్డి నీచ రాజకీయానికి నిదర్శనమన్నారు. తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకోని ముఖ్యమంత్రి కావాలనే నీచ చరిత్ర జగన్‌దని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు సా నుభూతి కోసం కోడి కత్తి డ్రామాలు ఆడి, బాబాయ్‌ హత్యను కూడా వాడుకు న్న ఘనుడు సీఎం జగన్‌ అని మండిపడ్డారు. ఉమామహేశ్వరి మరణంలో నందమూరి కుటుంబం విషాధంలో ఉంటే విషప్రచారం చేస్తూ వినోదం పొం దుతారా అంటూ ప్రశ్నించారు. ఆమె మరణాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు. ఎంపీ గో రంట్ల మాధవ్‌ తీరుతో యావత్‌ సమాజం సిగ్గుపడుతుందని, తక్షణమే అతడి పై దిశ కేసు నమోదు చేసి, బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 


ఇప్పుడు ప్రొటోకాల్‌ గుర్తుకురాదా?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ రోజూ ప్రొటోకాల్‌పై గగ్గో లు పెట్టిన స్థానిక వైసీపీ నేతలకు ఇప్పుడు అది గుర్తుకురాకపోవడం శోచనీయమన్నారు. ఓటమి పాలైన నాయకులతో సమావేశాలు పెట్టి సంక్షేమ పథకాలపై చర్చలు జరపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ తరఫున గెలుపొందిన వారిని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. మున్సిపల్‌ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయంలా మార్చే శారని ఆరోపించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు స్పష్టం చేశారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్లు లక్మోజీ, హర్ష, పప్పల మోహనరావు, కూనిశెట్టి భీమారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


ఎంపీ మాధవ్‌ను బర్తరఫ్‌ చేయాలి

- కురుపాం టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి 

గుమ్మలక్ష్మీపురం: రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎంపీ గోరింట్ల మాధవ్‌ను బర్తరఫ్‌ చేయాలని కురుపాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి డిమాండ్‌ చేశారు. శుక్రవారం తన స్వగృహంలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. ఎంపీ మాధవ్‌  ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలూరు శ్రీను, చిన్న, రాజేష్‌, రామారావు, నరేష్‌, దామోధర్‌, బాల, తదతరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T05:24:40+05:30 IST