Abn logo
Jun 7 2020 @ 04:05AM

ఇదే పని తీరు కొనసాగితే జాగ్రత్త

  • సిక్కోలులో రెవెన్యూ సిబ్బందిపై తమ్మినేని ఆగ్రహం


శ్రీకాకుళం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడానికి ఇదేమైనా వాళ్ల అబ్బ జాగీరా? భూము ల సేకరణలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇదే పనితీరు కొనసాగితే జాగ్రత్త!’’ అంటూ రెవెన్యూ సిబ్బందిపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహించారు. శ్రీకాకుళం జిల్లా పొం దూరు మండలంలో లైదాన్‌ రెల్లిగెడ్డ ఎత్తిపోతల పథకాల పనులను పరిశీలించడానికి శనివారం వెళ్లినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదలకు ఇళ్ల స్థలాల సేకరణలో ఇంత జాప్యమా? ఆక్రమణలకు గురైన స్థలాలను ఎందుకు తీసుకోవడం లేదు? ప్రభుత్వ స్థలాలైతే ఖాళీ చేయించడంలో ఎందుకు అంత జాప్యం? చాలా టైమ్‌ ఇచ్చాను. ఇక కుదరదు’’ అంటూ వారిని హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement