21,22 తేదీల్లో రెవెన్యూ స్పందన

ABN , First Publish Date - 2021-10-17T05:33:28+05:30 IST

జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 21,22 తేదీల్లో ప్రత్యేకంగా స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గా:మ, వార్డు సచివాలయాల్లో ఆ రెండు రోజులు రెవెన్యూ సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. నగరంలో నాసా అతిథిగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో యంత్రాంగం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

21,22 తేదీల్లో రెవెన్యూ స్పందన
రెవెన్యూ స్పందన పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రి బాలినేని, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం

అధికారులకు ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేయాలి

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 16 : జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 21,22 తేదీల్లో ప్రత్యేకంగా స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గా:మ, వార్డు సచివాలయాల్లో ఆ రెండు రోజులు రెవెన్యూ సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. నగరంలో నాసా అతిథిగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో యంత్రాంగం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ విషయంలో అధికారులు రాజకీయ నేతల సిఫార్సులను పట్టించుకోకుండా అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ  పట్టాదారు పాసుపుస్తకాలు, చుక్కల భూములు, సర్వే సమస్యలు, భూమిలో ఒకరు ఉండగా ఆన్‌లైన్‌లో మరొకరి పేరు ఉండటం తదితర సమస్యలన్నింటినీ ప్రత్యేక స్పందన ద్వారా  పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చిన అర్జీలను స్పందన పోర్టల్‌లో నమోదు చేసి మూడు నుంచి నాలుగునెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలోని ప్రజానీకం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. అంతకు ముందు మంత్రి బాలినేని, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌లు రెవెన్యూ స్పందన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీలు చేతన్‌, విశ్వనాథన్‌, డీఆర్వో సరళావందనం, ఒంగోలు ఆర్డీవో ప్రభార్‌రెడ్డి, డిప్యూటీ  కలెక్టర్‌ గ్లోరియా, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T05:33:28+05:30 IST