బసినికొండ భూమాయపై రెవెన్యూ విచారణ

ABN , First Publish Date - 2021-04-11T06:56:23+05:30 IST

మదనపల్లె మండలం బసినికొండ రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వభూమి అన్యాక్రాంతంపై ఉన్నతాధికారులు స్పందించారు.

బసినికొండ భూమాయపై రెవెన్యూ విచారణ
సీటీఎం గ్రామంలో శివానిని విచారిస్తున్న ఆర్‌ఐ రెడ్డెప్ప, వీఆర్వోలు

తహసీల్దార్‌కు సబ్‌కలెక్టర్ సోకాజ్‌ నోటీసు జారీ

మదనపల్లె, ఏప్రిల్‌ 10: మదనపల్లె మండలం బసినికొండ రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వభూమి అన్యాక్రాంతంపై ఉన్నతాధికారులు స్పందించారు. సర్వేనంబర్‌:718-3ఏలో 2.40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌ చేయడం ద్వారా ప్రవేటు వ్యక్తులు అమ్మేయడంపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 7న  ‘బసినికొండలో భూమాయ ’ శీర్షికన  కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ కుప్పుస్వామికి షోకాజ్‌నోటీసు ఇచ్చారు. దీనిపై కుప్పుస్వామి..718లోని ఈ భూమిని ఏపీఐసీసీకి కేటాయించి,  తర్వాత రద్దు చేశారని, ఇప్పటి వరకూ అందులోని భూమిని ఎవరికీ పట్టా ఇవ్వలేదని, రెవెన్యూ రికార్డుల ప్రకారం అనాధీనంగానే ఉందని నివేదించారు. అలాగే ఆన్‌లైన్‌లోని 2.40 ఎకరాలకు డిజిటల్‌ కీ పెట్టాలని వీఆర్వో శ్రీనివాసులు, తహసీల్దార్‌కు రెకమెండ్‌ చేశారని అందులో వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తహసీల్దార్‌ విషయం లేక పోవడంతో సంతృప్తి చెందని సబ్‌కలెక్టర్‌..పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని తిప్పిపంపారు.  ఈ నేపథ్యంలో ఆర్‌ఐ రెడ్డెప్ప, ఆర్వోలు శనివారం సీటీఎం గ్రామానికి వెళ్లి భూమి యజమానికిగా చెబుతున్న వి.శివానీ, ఆమె కుటుంబ సభ్యులను విచారించారు. ఈభూమి ఎలా వచ్చింది.. రికార్డులు ఏమున్నాయి? అవి ఎలా వచ్చాయి..ఎవరు ఆన్‌లైన్‌ చేశారు? ఇందులో సహకరించెదెవరు? అనే కోణంలో విచారించి నివేదికను సిద్ధం చేస్తున్నారు.  ఇదిలావుండగా, 2016 అప్పటి తహసీల్దార్‌ శివరామిరెడ్డి ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, తర్వాత వచ్చిన తహసీల్దార్‌ డిజిటల్‌ కీ తీసేశారు. తిరిగీ 2020 జూన్‌లో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుతం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న సి.ఎ్‌స.సురే్‌షబాబు డిజిటల్‌ కీ పెట్టి వన్‌బీ మంజూరు చేశారు. దీంతో సీటీయానికి చెందిన వి.శివానీ, ఆమె కుమారుడు వి.శ్రీనాథ్‌రెడ్డిలు పట్టణానికి చెందిన మరొకరికి విక్రయించి, 2020 సెప్టెంబరు 28వతేదీన రిజిస్ర్టేషన్‌ చేశారు. ఇందులో కొండామరిపల్లె గ్రామానికి చెందిన వీఆర్వో శ్రీనివాసులు..డీజిటల్‌ కీ రెకమెండ్‌ చేశారు. నిజానికి అప్పట్లో ఇక్కడ వీఆర్వో గంగాధర్‌, ఆర్‌ఐ చాణిక్య ఉండగా, వీరిద్దరి ప్రమేయం లేకుండా పక్క గ్రామానికి చెందిన వీఆర్వో శ్రీనివాసులు, తహసీల్దార్‌ సురే్‌షబాబు పని కానిచ్చేశారు. ఇందులో వీఆర్వోతోపాటు తహసీల్దార్‌ కార్యాలయంలోని ఓ జూనియర్‌ అసిస్టెంట్‌, డీటీలు వెనుకుండీ కథ నడిపించినట్లు తెలిసింది. మదనపల్లె-పుంగనూరు జాతీయ ప్రదాన రహదారికి అనుకుని ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని వీరంతా అన్యాక్రాంతం కావడానికి కారణమయ్యారు. ఇందులో లక్షల రూపాయలు చేతులు మారినట్లు..విచాణ అధికారుల దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో కీలకమైన తహసీల్దార్‌ సురే్‌షబాబును వదిలేసి, వీఆర్వోని ఒక్కరినే బాధ్యులు చేస్తున్నారనే ప్రచారం రెవెన్యూ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికే వీఆర్వో... డిజిటల్‌ కీకి రెకమెండ్‌ చేసిన పత్రాన్ని, సబ్‌కలెక్టర్‌కు అందజేయగా, తప్పంతా వీఆర్వోదే అనే విధంగా తసీల్దార్‌, ఆర్‌ఐలు నివేదిక సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ భూమి పరాధీనంపై ఇప్పటికే సీరియ్‌సగా ఉన్న సబ్‌కలెక్టర్‌..ఇందుకు బాధ్యులైన నిందితులందరిపై చర్య తీసుకుంటారో లేక వీఆర్వోను ఒక్కరినే బలి చేస్తారోనన్న రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-04-11T06:56:23+05:30 IST