రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2022-08-07T06:58:08+05:30 IST

: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎ్‌సఏ) ఎన్టీఆర్‌ జిల్లా శాఖ అడ్‌హక్‌ కమిటీ పరిధిలో నాలుగు యూనిట్లకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.

రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలు ఏకగ్రీవం

- కలెక్టరేట్‌, విజయవాడ, నందిగామ, తిరువూరు యూనిట్లకు కొత్త కార్యవర్గం  

విజయవాడ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎ్‌సఏ) ఎన్టీఆర్‌ జిల్లా శాఖ అడ్‌హక్‌ కమిటీ పరిధిలో నాలుగు యూనిట్లకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌తో పాటు విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్ల యూనిట్లకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పోటీగా ఎవరూ ప్యానెల్‌ను ఎంపిక చేయకపోవటంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎస్‌.జనార్దనరావు, వీవీఎ్‌సఎస్‌ సుబ్బారావు (విజయవాడ డివిజన్‌), టి.నాగరాజు, ఎన్‌వీఎస్‌ ప్రదాన్‌  (కలెక్టరేట్‌ యూనిట్‌), బి.భోజరాజు, ఎస్‌కే దాదా సాహెబ్‌ (నందిగామ డివిజన్‌), పీఎ్‌సవీ ప్రసాద్‌, జి.వెంకటేశ్వరరావులు (తిరువూరు డివిజన్‌)కు ఎన్నికలఅధికారులుగా వ్యవహరించారు. 

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌ నూతన కార్యవర్గం 

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఏపీఆర్‌ఏ్‌సఏ యూనిట్‌ అధ్యక్షుడిగా యు.ఆనంద్‌, అసోసియుట్‌ ప్రెసిడెంట్‌గా ఎ.రాజేష్‌, ఉపాధ్యక్షుడు (1, 2, 3)గా కేవీఎస్‌ చందు, డి.చంద్రమౌళి, బి.హేమకుమారి, కార్యదర్శిగా కె.నాగభూషణం, జాయింట్‌ సెక్రటరీ(1, 2, 3)లుగా ఎండీ ఫయాజ్‌ ఆలీ, ఆర్‌.కృష్ణకిషోర్‌, ఎం.అర్జునరావు, కోశాధికారిగా ఎం.మధుసూదనరావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు (1, 2)లుగా టి.నాగరాజు, పి.అరవింద్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

విజయవాడ డివిజన్‌.. 

విజయవాడ రెవెన్యూ డివిజన్‌ ఏపీఆర్‌ఎ్‌సఏ యూనిట్‌కు అధ్యక్షులుగా చింతకాయల అప్పారావు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఎం.సూర్యారావు, వైస్‌ ప్రెసిడెంట్‌లు (1, 2, 3)గా సీహెచ్‌ ప్రవీణ్‌బాబు, పి.విజయ్‌ కుమార్‌, ఎస్‌ బేబీ సరోజిని, కార్యదర్శిగా యలమంచిలి రవి, జాయింట్‌ సెక్రటరీలు (1, 2, 3)గా సీహెచ్‌జేకే నందకుమార్‌, జి.వెంకటేశ్వర్లు, వి.కుమార్‌, కోశాధికారిగా సంకుల నారాయణరావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు (1, 2)గా టి.సత్యనారాయణ, వి.సునీల్‌ కుమార్‌లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 

నందిగామ డివిజన్‌.. 

నందిగామ రెవెన్యూ డివిజన్‌ ఏపీఆర్‌ఏ్‌సఏ యూనిట్‌కు అధ్యక్షులుగా ఎస్‌.నాగరాజు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా కె.లక్ష్మీ కళ్యాణి, ఉపాధ్యక్షులు (1, 2, 3)గా కె.రామమూర్తి రెడ్డి, కె.శ్రీరామ కృష్ణ, కె.వేణుకుమారి, కార్యదర్శిగా ఎస్‌కే నాగుల్‌ మీరా, జాయింట్‌ సెక్రటరీలుగా వి.శివప్రసాద్‌, బి.సూరమ్మ, కె.దావీదు, కోశాధికారిగా ఎస్‌.సంధ్యారాణి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు (1, 2)గా యు.ఆనంద్‌ బాబు, డి.జనార్దనరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

తిరువూరు డివిజన్‌.. 

తిరువూరు రెవెన్యూ డివిజన్‌ ఏపీఆర్‌ఎ్‌సఏ యూనిట్‌కు అధ్యక్షులుగా ఎస్‌.సురేష్‌ బాబు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా కె.రవికుమార్‌, ఉపాధ్యక్షులు (1, 2, 3)గా బి.మోహనరావు, ఎస్‌ కిషోర్‌ చంద్ర, జి.నాగమణి, కార్యదర్శిగా బి.మోతియా, జాయింట్‌ సెక్రటరీలు (1, 2, 3)గా యు.గోపి, జి.పుల్లయ్య, సీహెచ్‌.నరసింహారావు, ట్రెజరర్‌గా బి.శివనాగరాజు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు (1, 2)గా ఎం.రాములు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

Updated Date - 2022-08-07T06:58:08+05:30 IST