వారసత్వ సంపదను కేసీఆర్ అమ్ముతున్నారు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-19T22:35:52+05:30 IST

వారసత్వ సంపదను కేసీఆర్ అమ్ముతున్నారు: రేవంత్‌రెడ్డి

వారసత్వ సంపదను కేసీఆర్ అమ్ముతున్నారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ సీఎం అయ్యాక వారసత్వ సంపదను అందినకాడికి అమ్ముతున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. వెయ్యికోట్ల కుంభకోణంపై వివరణ ఇస్తారని ఆశించామని, బంగారంకంటే విలువైన భూములను అమ్ముతూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఆనాడు ప్రాజెక్టుల కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కాంగ్రెస్ అమ్మాలని చూస్తే కేసీఆర్ అడ్డుపడ్డారని రేవంత్‌రెడ్డి అన్నారు. సీమాంధ్ర సీఎంలు భూములు అమ్మడానికి భయపడ్డారని, ఆనాడు అమ్మకుండా మిగిలిపోయిన భూములను కేసీఆర్ తన బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట, నార్సింగిలో పేదలకు కేటాయించిన భూములను అమ్ముతున్నారని, ప్రెస్టేజ్ ఎస్టేట్, శ్రీచైతన్య కంపెనీ కూడా 15 ఎకరాలు కొనుగోలు చేశాయని రేవంత్ రెడ్డి అన్నారు.

Updated Date - 2021-07-19T22:35:52+05:30 IST