Secunderabad ఉజ్జయిని Mahankaliని దర్శించుకున్న Revanth, Thakur

ABN , First Publish Date - 2022-07-17T18:42:21+05:30 IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Secunderabad ఉజ్జయిని Mahankaliని దర్శించుకున్న Revanth, Thakur

హైదరాబాద్ (Hyderabad): సికింద్రాబాద్ ఉజ్జయిని (Ujjaini) మహంకాళి (Mahankali) అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోవడానికి పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy), రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఠాకూర్ (Thakur) ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో అనేక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారన్నారు. క్రూరమైన బుద్ధితో పరిపాలించే వారి మనసు మార్చాలని.., బుద్ధి మారకుంటే వారిని మార్చాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలని మహంకాళిని కోరినట్లు రేవంత్‌ పేర్కొన్నారు.


కాగా ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ వాగ్వివాదానికి దిగారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రొటోకాల్ పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను  తోసుకుని రేవంత్‌రెడ్డి ఆలయం దగ్గరకు వెళ్లారు. 

Updated Date - 2022-07-17T18:42:21+05:30 IST