నాంపల్లి రోడ్డుపై పరుగులు పెట్టిన రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-02T00:41:22+05:30 IST

నాంపల్లిలో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ ధర్నాలు చేశాయి. యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్‌పై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ..

నాంపల్లి రోడ్డుపై పరుగులు పెట్టిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: నాంపల్లిలో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ ధర్నాలు చేశాయి. యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్‌పై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ.. బీజేపీ ఆఫీసు వైపు ఎంపీ రేవంత్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి బీజేపీ నేతల యత్నించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నాంపల్లి రోడ్డుపై రేవంత్‌రెడ్డి పరుగులు పెట్టారు. అనంతరం ఆయన ప్రధాన రహదారిపై బైఠాయించారు. రేవంత్‌కు పోటీగా బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే రాహుల్‌ను అరెస్ట్ చేసారా? అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణంగా దళిత మహిళలను అత్యాచారం చేసి హత్య చేశారన్నారు. అనుమానిత మరణం జరిగినప్పుడు మృతదేహాన్ని దాచి పెట్టాలి.. కానీ అర్ధరాత్రి దహనం చేయాల్సిన అవసరం ఏముంది? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-02T00:41:22+05:30 IST