వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మహబూబాబాద్‌లో గుండెపోటుతో చనిపోయిన టీచర్ జేత్రామ్ కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం బయ్యారంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.