కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి పది ప్రశ్నలు

ABN , First Publish Date - 2022-04-11T22:03:33+05:30 IST

ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణ నుంచి ఇక మీదట బాయిల్డ్ రైస్ ఇవ్వమని

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి పది ప్రశ్నలు

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణ నుంచి ఇక మీదట బాయిల్డ్ రైస్ ఇవ్వమని, కేసీఆర్ కేంద్రానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా?.. ఆ లేఖను అడ్డుపెట్టుకుని.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మెలిక పెడుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆరే లేఖ ఇచ్చి ఆయనే ధర్నా చేస్తే మీ మోసాన్ని.. ప్రజలు గ్రహించలేరని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. యాసంగిలో మొదలు వచ్చే వడ్ల నుంచి రా రైస్ వస్తుందని, కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడం.. రైతులను మోసం చేసే దురుద్దేశం తప్ప మరేమిటి? అని రేవంత్‌ ప్రశ్నించారు. ధాన్యం కొనాల్సిన ప్రభుత్వాలు.. దగుల్భాజీ రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కష్టం చేసిన రైతు దళారీ చేతిలో దగాపడుతున్నాడని తెలిపారు. ఒకడు ఢిల్లీలో, ఒకడు గల్లీలో నడుపుతోన్న.. సిల్లీ డ్రామాలలో రైతే సమిధ అవుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు రాజకీయ సమాధి కట్టేది రైతులేనని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-04-11T22:03:33+05:30 IST