Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 27 2021 @ 20:27PM

ఈటలతో కేసీఆర్ తగవు అందుకే: రేవంత్

హుజురాబాద్‌: వాటాలు, కమీషన్ల కోసమే కేసీఆర్‌తో ఈటల తగవు పెట్టుకున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు సమస్యలపై ఈటల ఎందుకు మాట్లాడలేదు?, ఉద్యోగాల భర్తీ కోసం ఈటల ఎప్పుడైనా పోరాడారా?, దళితులకు మూడెకరాల గురించి ఈటల ఎప్పుడైనా ప్రశ్నించారా?, హరీష్‌రావు, ఈటల 20 ఏళ్లు కలిసి తిరగలేదా?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో మోదీకి, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇద్దరూ కలిసి లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ.110 చేశారని, గ్యాస్‌ సిలిండర్‌ ధరను కూడా రూ.1000 చేశారని వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement