చివరి గింజ వరకు పంటను కొనాల్సిందే: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-27T22:54:12+05:30 IST

చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

చివరి గింజ వరకు పంటను కొనాల్సిందే: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల వైఖరే కారణమన్నారు. రైతుల వరి పంటను కొనుగోలు చేయబోమన్న సీఎం కేసీఆర్.. తన ఫామ్‌హౌస్‌లో వరి పంట ఎందుకు వేశారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వడ్లు కొనేవారు.. రైతుల వడ్లు కొనరా అని నిలదీశారు. రైతులు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ నేతలు రైతుల సమస్యలు పక్కన పెట్టి.. నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని ఆరోపించారు. నిరుద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2021-12-27T22:54:12+05:30 IST