HYD: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-27T16:10:16+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

HYD: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

హైదరాబాద్:  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదంటూ రేవంత్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రేవంత్ ఇంటికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Updated Date - 2021-12-27T16:10:16+05:30 IST