డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-25T20:58:28+05:30 IST

డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే అంశాన్నే మర్చిపోతున్నారని, ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటా డిస్కంలకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఏటా రూ.6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తోందని, డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్‌ రాష్ట్ర ప్రభుత్వమేనని తప్పుబట్టారు. విద్యుత్‌ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-25T20:58:28+05:30 IST