కేసీఆర్‌ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా?: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-17T18:30:44+05:30 IST

కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిరసనలకు పిలుపు ఇచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

కేసీఆర్‌ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా?: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిరసనలకు పిలుపు ఇచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ నివాసం దగ్గర రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా? అని ప్రశ్నించారు. విపక్షనేతలను అరెస్ట్‌ చేసి మంత్రి కేటీఆర్‌ తన తండ్రికి నజరానా ఇవ్వాలనుకున్నారా? అని నిలదీశారు. కేసీఆర్‌ జన్మదినం నిరుద్యోగుల ఖర్మదినంగా మారిందన్నారు. సీఎం జన్మదిన వేడుకలను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగించాలని, నిరుద్యోగులకు మద్దతుగా అన్నీ మండల కేంద్రాల్లో.. సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

Updated Date - 2022-02-17T18:30:44+05:30 IST