PK, బీజేపీ ప్లాన్‌లో భాగంగానే KCR నాటకాలు: Revanth

ABN , First Publish Date - 2022-07-05T20:11:04+05:30 IST

పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. నేడు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)తో..

PK, బీజేపీ ప్లాన్‌లో భాగంగానే KCR నాటకాలు: Revanth

New Delhi : పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. నేడు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)తో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. జులై 7 నాటికి పీసీసీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి అవుతుందని.. ఈ కాలంలో తాను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్‌కి వివరించానని వెల్లడించారు. ప్రశాంతి కిషోర్(Prashanth Kishore), బీజేపీ ప్లాన్‌లో భాగంగానే సీఎం కేసీఆర్(CM KCR) నాటకాలు ఆడుతున్నాడని రేవంత్ విమర్శించారు. పశ్చిమబెంగాల్(West Bengal) తరహాలో ప్రశాంత్ కిషోర్ రాష్ట్రాన్ని తయారు చేయాలని చూస్తున్నాడన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విపక్షాలన్నీ తుడుచుకో పెట్టుకోవడానికి ప్రశాంత్ కిషోరే కారణమన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రశాంత్ కిషోర్ యత్నిస్తున్నారన్నారు.


ఇంకా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రాబోయే కాలంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. చేరికలపై అనూహ్యంగా ముందుకు వెళ్తున్నాం. ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి పార్టీలో చేర్చుకుంటున్నాం. పార్టీలో చేరే వారి గురించి ముందే మీడియాకు తెలియడం వల్ల అధికార పార్టీ వారిపైన కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. అందువల్లనే పార్టీలో చేరే వారిని ముందుగా మీడియాకు తెలియనివ్వట్లేదు. హైదరాబాద్‌లో విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) నన్ను కూడా ఆహ్వానించారు. మీడియా కావాలని తప్పుడు ప్రచారం చేస్తోంది. రాబోయే కాలంలో హైదరాబాదులో జిల్లా కార్యకర్తలను కలుపుకొని విష్ణువర్ధన్ రెడ్డి సభ పెడతానన్నారు. దానికి టీపీసీసీ అధ్యక్షుడిగా అన్ని అనుమతులూ ఇచ్చాను. రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు సందర్భంగా విపక్షాల మీటింగ్‌కి కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారు? టీఆర్ఎస్ పార్టీ(TRS Party) అధికారంలోకి రావడానికి బీజేపీ సహాయం చేస్తోంది. వారు చేస్తున్న చర్యలన్నిటికీ విరుద్ధంగా మా కార్యచరణ ఉంటుంది. పెరేడ్ గ్రౌండ్‌లో మొదట టీఆర్ఎస్, రెండు బీజేపీ సభ పెట్టాలి దాని తర్వాత మూడవ సభ మేము పెడతాము. మా సభకు ఎంతమంది వస్తారో చూడాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-05T20:11:04+05:30 IST