ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-06-10T00:08:42+05:30 IST

Hyderabad: తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సమావేశానికి తానే స్వయంగా

ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Hyderabad: తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సమావేశానికి తానే స్వయంగా వస్తానని చెప్పారు. హైదరాబాద్‌లో ఇటీవల పబ్, క్లబ్‌లలో జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని గుర్తుచేశారు. ఇందుకోసం అఖిలపక్షంతో, మహిళా, స్వచ్ఛంద, పౌర రక్షణ సంఘాలతో కలిసి చర్చించాలని కోరారు. "జూబ్లీహిల్స్‌లో ఓ బాలిక మీద నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సిగ్గుపడాల్సిన విషయం. ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసులు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది.? సాక్ష్యాలను, ఆధారాలను మాయం చేశారని వస్తున్న వాదనకు సీఎం సమాధానం చెప్పరా.? ఒక ప్రభుత్వ వాహనంలో  ఈ గ్యాంగ్ రేప్ జరిగితే మీకు బాధ్యత లేదా..? అని రేవంత్ రెడ్డి లేఖలో కేసీఆర్‌ను ప్రశ్నించారు. 


Updated Date - 2022-06-10T00:08:42+05:30 IST