బతుకులు మారాలంటే టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2020-10-30T11:50:28+05:30 IST

తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల బతుకులు మారాలంటే, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సను ఓడించి బుద్ధి చెప్పాలని, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

బతుకులు మారాలంటే టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివా్‌సరెడ్డిని గెలిపించాలి 

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి


 మిరుదొడ్డి, అక్టోబరు29: తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల బతుకులు మారాలంటే, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సను ఓడించి బుద్ధి చెప్పాలని, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మిరుదొడ్డి మండలం కూడవెల్లి, అక్బర్‌పేట, భూంపల్లి, బేగంపేట, రుద్రారం, మోతే, కాసులాబాద్‌ గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షో ఆయన మాట్లాడారు. రాష్ర్టానికి న్యాయం జరగాలంటే దుబ్బాక ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మీకు ఎమ్మెల్యే కావాలంటే పెద్ద విషయం కాదని, ప్రశ్నించే గొంతును శాసన సభకు పంపితే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ ఉప ఎన్నిక కోసం నాలుగుకోట్ల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. దుబ్బాక ఓటర్లు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎ్‌సకు గుణపాఠం చెప్పడానికి ఒక మంచి అవకాశం వచ్చిందన్నారు. ముత్యంరెడ్డి ఆశయాలను కొనసాగించాలంటే చెరుకు శ్రీనివా్‌సరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ సురే్‌షషేట్కా ర్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, కాంగ్రెస్‌ నా యకులు సోమేశ్వర్‌రెడ్డి, నర్సింహ్మారెడ్డి, గాల్‌రెడ్డి, భూపాల్‌గౌడ్‌, శ్రీధర్‌, శ్రీనివాస్‌, నాగరాజు, మల్లేశం, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T11:50:28+05:30 IST