Abn logo
Feb 14 2020 @ 18:43PM

సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం నాడు సీఎంకు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావిస్తూ.. కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


సుమారు 12 గంటలపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై కనీస ప్రస్తావన చేయని మీ (కేసీఆర్) వైఖరి పట్ల రేవంత్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతల బలవన్మరణాలు, వారి కష్టనష్టాలపై సమీక్షించేందుకు ఒ ఐదు నిమిషాలైనా సమయం దొరకలేదా..? లేదా మనసురాలేదా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంతటితో ఆగని ఆయన.. 12 గంటల సదస్సులో మీ ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటల గారఢీలు తప్ప మీరు తీసుకున్న నిర్ణయాలేంటి..? సీఎంను ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై పలు ప్రశ్నలు సంధించారు.


- రెండు దఫాలు అధికారంలోకి వచ్చినప్పుడు రూ. లక్ష చొప్పున చేస్తానన్న మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు

- రైతుబంధును ఎన్నికల పథకంగా మార్చేశారు. ఎన్నికలుంటేనే రైతుబంధు వస్తుందని తేలిపోయింది

- పెట్టుబడి నుంచి గిట్టుబాట ధర వరకు జిందా తిలిస్మాత్ అన్నట్లు మీరు చెప్పిన సమన్వయ సమితి.. మీ నాయకుల రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఇవన్నీ కలగలిసి రైతులు ఉసురు తీస్తున్నాయని రేవంత్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.


రేవంత్ రాసిన లేఖను ఈ దిగువున చూడండి..

Advertisement
Advertisement
Advertisement