Hyderabad : నేటి మధ్యాహ్నం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. టీఆర్ఎస్ పార్టీ(TRS Party)కి బడంగ్ పెట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) పెద్దల సమక్షంలో నేటి సాయంత్రం కానీ.. రేపు ఉదయం కానీ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలోనే రేవంత్.. పారిజాతారెడ్డితో కలిసి హస్తినకు వెళ్లనున్నారు.