Telangana: శ్రీలంక పరిస్థితి తెలంగాణలో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-05-18T19:58:06+05:30 IST

కేసీఆర్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాల తీయించారని ఆరోపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.69 వేల కోట్లు అప్పు

Telangana: శ్రీలంక పరిస్థితి తెలంగాణలో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Telangana: కేసీఆర్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాల తీయించారని ఆరోపించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.69 వేల కోట్లు అప్పు చేస్తే...కేసీఆర్ 7 ఏళ్ల పాలనలో రూ.5లక్షల కోట్లు చేశారని గుర్తు చేశారు. శ్రీలంక పరిస్థితి తెలంగాణలోనూ వస్తుందన్నారు. శ్రీలంక అధ్యక్షుడిపై దాడి ఘటనలు తెలంగాణలో కూడా వస్తాయన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతు విప్లవాలను కేసీఆర్ ధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో చెరుకు, కందులు, పత్తి, మాయమైందని, వరికి మాత్రమే రైతులు పరిమితం అయ్యారని పేర్కొన్నారు. త్వరలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే  రైతు డిక్లరేషన్ వందశాతం అమలు చేస్తామని, ఆ బాధ్యత తానే తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 

Updated Date - 2022-05-18T19:58:06+05:30 IST