ఆ నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ఉంది: Revanth Reddy

ABN , First Publish Date - 2022-06-15T00:26:41+05:30 IST

Hyderabad : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నష్టాల్లో ఉన్న పత్రికను నడిపే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందని, ఆస్తుల

ఆ నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ఉంది:  Revanth Reddy

Hyderabad : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా, రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపడం వెనక రాజకీయ కుట్ర  దాగి ఉందని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి ఆరోపించారు. నష్టాల్లో ఉన్న పత్రికను నడిపే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుందని, ఆస్తుల బదలాయింపులో ఆర్థిక లావాదేవీలు జరగలేదని గతంలోనే ఈడీ తేల్చి చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. మూసేసిన కేసును మళ్ళీ తెరిచి సోనియా, రాహుల్ గాంధీకి ఈడీతో నోటీసులు ఇప్పించడం వెనక బీజేపీ కుట్ర ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళితే ఓడిపోతామనే భయం ప్రధాని మోదీకి ఉందన్నారు. విచారణ పేరుతో రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో  రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలో ఉంచడం వేధించడమేనని పేర్కొన్నారు. సోనియా గాంధీ ఈడీ కార్యాలయంలో అడుగు పెట్టిన రోజే బీజేపీ పతనం ప్రారంభమవుతుందన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టైనా రాహుల్ గాంధీకి జరిగే అవమానాలను అడ్డుకుంటామన్నారు. అవసరమయితే  23న ఢిల్లీ వెళ్లి ఈడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. 

Updated Date - 2022-06-15T00:26:41+05:30 IST