Abn logo
Apr 16 2021 @ 04:01AM

అసెంబ్లీని తాగుబోతుల అడ్డాగా మార్చారు: రేవంత్‌

నిడమనూరు, ఏప్రిల్‌ 15: దేవాలయం లాంటి అసెంబ్లీని తాగుబోతుల అడ్డాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డిని గెలిపించాలని కోరుతూ నిడమనూరు మండలంలోని నారమ్మగూడెం, తుమ్మడం, రాజన్నగూడెం, నిడమనూరు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానారెడ్డి గెలిస్తే అసెంబ్లీలో కేసీఆర్‌ పప్పులు ఉడకవని, అందుకే ఆయన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సన్నాసులు, దద్దమ్మలకు జానారెడ్డి గొప్పదనం ఏం తెలుసని ప్రశ్నించారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత జానారెడ్డిదేనన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మిత్రద్రోహి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు నమ్మకద్రోహిగా మారారన్నారు.    

Advertisement
Advertisement
Advertisement