ఆస్తి కోసం సోదరిని చంపిన అన్నదమ్ములు

ABN , First Publish Date - 2021-03-07T05:15:01+05:30 IST

ఆస్తి కోసం తోడబుట్టిన అన్నదమ్ములే తమ సోదరిని అతిదారుణంగా హత్య చేశారు. ఇందు లో వారికి ఆమె భర్త కూడా సహకరించాడు. రెంజల్‌ మం డలం నీలాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.

ఆస్తి కోసం సోదరిని చంపిన అన్నదమ్ములు
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ రామారావు

నిందితులకు సహకరించిన భర్త 

నీలాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

రెంజల్‌, మార్చి 6: ఆస్తి కోసం తోడబుట్టిన అన్నదమ్ములే తమ సోదరిని అతిదారుణంగా హత్య చేశారు. ఇందు లో వారికి ఆమె భర్త కూడా సహకరించాడు. రెంజల్‌ మం డలం నీలాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. బోధన్‌ ఏసీపీ రామారావు శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన ఒడ్డె సాయమ్మ(68)కు అదే ఊరిలోని వీరన్నతో 45 ఏళ్ల క్రి తం ఇల్లరికం వివాహం చేశారు. వీరికి ఒక కొడుకు పోశెట్టి ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఆదిలాబాద్‌ జిల్లాలో నివసిస్తున్నాడు. కాగా, సాయమ్మ తల్లిదండ్రుల పేర మీద ఉన్న ఎ కరం 18 గుంటల భూమిలోని వాటాల కోసం కొన్ని రోజు లుగా అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతోంది. గత ఏడా ది నవంబరు 21వ తేదీన సాయమ్మతో వీరన్నకు గొడవ కాగా, దీనికి ఆసరా తీసుకొని ఆమె అన్నదమ్ములు సాయమ్మను కొట్టి చున్నితో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసి గోదావరిలో పడేశారు. కొద్దిరోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు తన తల్లి కనిపించ డం లేదని స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా, కుటుంబీకులను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన శైలి లో విచారించగా, నేరాన్ని అ ంగీకరించారు. ఆమె సెల్‌ఫో న్‌ను తదితర వస్తువులను ఒకచోట దాచిపెట్టగా నింది తులు చూపించడంతో వాటి ని సేకరించామన్నారు. దీంతో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌ పంపుతున్నట్లు ఏసీపీ చె ప్పారు. విలేకరుల సమావేశ ంలో బోధన్‌ రూరల్‌ సీఐ రవీందర్‌నాయక్‌, రెంజల్‌ ఎస్సై మురళి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:15:01+05:30 IST