తిరుగు ప్రయాణం

ABN , First Publish Date - 2021-10-19T05:15:31+05:30 IST

దసరా సె లవులు ముగుసడంతో పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకు వెళ్లిన వారు తిరుగు ముఖం పట్టారు.

తిరుగు ప్రయాణం
బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల పాట్లు

 - ప్రయాణికులతో కిటకిటలాడిన ఆర్టీసీ బస్టాండ్‌

- దసరా సెలవులు పూర్తికావడమే కారణం 

- సామర్థ్యానికి మించి ఎక్కుతున్న ప్రయాణికులు

- రద్దీ మేరకు బస్సుల ఏర్పాటు: డీఎం

మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 18: దసరా సె లవులు ముగుసడంతో పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకు వెళ్లిన వారు తిరుగు ముఖం పట్టారు. దాం తో సోమవారం మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ ప్రయా ణికుల రద్దీతో కిటకిటలాడింది. ఈ నెల 6నుంచి 17వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దాంతో పట్టణ ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, పనుల నిమిత్తం వలస వెళ్లిన కూలీలు పం డుగను పురస్కరించుకొని గ్రామాలకు వచ్చారు.  సోమవారం నుంచే కొన్ని కళాశాలల్లో  పరీక్షలు ని ర్వహించడంతో పలువురు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం నుంచే తిరుగుముఖం పట్టారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులను ఏ ర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవే స్తున్నారు. మంగళవారం మిలాద్‌ నబీ ఉన్నందున కొందరికి సెలవు ఉండటంతో ప్రయాణాన్ని విర మించుకున్నారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని కొందరు ప్రైవే టు వాహనాలను ఆశ్రయించారు. మ హబూబ్‌నగర్‌ పట్టణం లో కూడా రోడ్లపై రెండు రోజుల నుంచి  వాహ నాల రద్దీ అధికంగా ఉన్నది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉం చుకొని బ స్సుల సంఖ్య హైదరాబాద్‌కు పెంచి నట్లు ఆర్టీసీ డీఎం అశోక్‌రాజు తెలిపారు.  అనుకున్న దాని కంటే సుమారు 50 ప్రత్యేక బస్సులను హైద రాబాద్‌ నడుపుతున్నా మ న్నారు. కొన్ని రూట్లలో బ స్సులను రద్దు చేసి సిటీకి నడుపుతున్నట్లు  తెలిపారు.









Updated Date - 2021-10-19T05:15:31+05:30 IST