పలాస రైల్వే స్టేషన్‌లో క్యూ కట్టిన జనం
కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్‌లు
పలాస, జనవరి 16: సంక్రాంతి సందడి పూర్తవడంతో గ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగుప్రయాణమయ్యారు. దీంతో ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్‌లు కిక్కిరిసాయి. రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో రాకపోకలు లేకపోవడంతో ఈ సంక్రాంతికి ఇతర ప్రాం తాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు స్వగ్రామాలకు తరలివచ్చారు. ఇదిలా ఉండగా మూడో దశ కరోనా హెచ్చరికలు రావడంతో ఇక్కడ చిక్కిపోకుండా తాము పనులు చేసుకునే ప్రాంతాలకు వెళ్లిపోతు న్నారు. రైళ్ల రిజర్వేషన్ల ప్రకారం ప్రయాణం అవకాశం ఉండడంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోతోంది. దీనికి తోడు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు పూర్తవడం, సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులు కూడా తిరుగు ప్రయాణమయ్యారు.