Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 21 May 2022 20:27:58 IST

Sammathame: ఆకట్టుకుంటోన్న ‘బావ తాకితే’.. రెట్రో స్టైల్ పాట

twitter-iconwatsapp-iconfb-icon

యంగ్ హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), చాందిని చౌదరి (Chandini Chowdary) కాంబినేషన్‪లో తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’ (Sammathame). గోపీనాథ్ రెడ్డి (Gopinath Reddy) దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌.. అన్ని  వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. అలాగే ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు కూడా శ్రోతల్ని అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘బావ తాకితే’ (Baava Thaakithe) అనే లిరికల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. 80లో రెట్రో స్టైల్లో చిత్రీకరించిన ఈ పాటలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరిల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.


‘‘ చిటపట చినుకులు కురిసెనులే

యదలో అలజడి రేగే

పడిపడి తపనలు తడిసెనులే

తనువే తహతహలాడే

ఏమి జరిగిందో.. నీ జారు జారు పైట జారిపోతుందే

ఈడు దాడుల్లో.. నా వంటి నుండే సిగ్గుపారిపోయిందే.. ’’ అంటూ సాగిన సాహిత్యం, విజువల్స్, కాస్ట్యుమ్స్, మ్యూజికల్ బ్యాకింగ్ ఇలా అన్నీ  రెట్రో స్టైల్‪ని అందంగా ప్రజంట్ చేశాయి. ఈ పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu) సాహిత్యం అందించగా.. సింగర్స్ మల్లికార్జున్ (Mallikarjun), మాళవిక (Malavika) శ్రావ్యంగా ఆలపించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర (Sekhar Chandra) రెట్రో స్టైల్ (retro style)కి అనుగుణంగా చక్కని బాణీలను సమకూర్చారు. యూజీ ప్రొడక్షన్స్‌ (UG Productions)లో కంకణాల ప్రవీణ (Kankanala Praveena) నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ఈ పాట.. యూట్యూబ్‪లో టాప్‪లో ట్రెండ్ అవుతోంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International