ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ 60 ఏళ్లకు పెంపు

ABN , First Publish Date - 2021-02-26T09:15:32+05:30 IST

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ 60 ఏళ్లకు పెంపు

9, 10, 11 తరగతులకు వార్షిక పరీక్షలు రద్దు: ఎడప్పాడి


చెన్నై, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం కలైవానర్‌ అరంగంలో ఏర్పాటైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో 110 సభా నిబంధన ప్రకారం ఆయన ప్రకటన చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ పొడిగింపు వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే మే నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ ఉత్తర్వు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇదే విధంగా 2020-21 విద్యా సంవత్సరంలో 9, 10, 11 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించనున్నట్లు ఎడప్పాడి పళనిస్వామి మరో ప్రకటన చేశారు.

Updated Date - 2021-02-26T09:15:32+05:30 IST