రిటైర్మెంట్‌ వయసు పెంపును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-25T05:52:59+05:30 IST

రాష్ట్రప్రభుత్వం.. ఉద్యోగ విరమణ వయసు పెం చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థి, యువజనసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

రిటైర్మెంట్‌ వయసు పెంపును ఉపసంహరించుకోవాలి
మంత్రి శంకరనారాయణకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 24: రాష్ట్రప్రభుత్వం.. ఉద్యోగ విరమణ వయసు పెం చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థి, యువజనసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రాష్ట్ర మంత్రి శంకరనారాయణను కలిసి వి ద్యార్థి, యువజనసంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కా ర్యవర్గసభ్యుడు మనోహర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్‌, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర, ఏఐఎ్‌సబీ పృథ్వీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయసు పెంపుపై అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఆర్థికశాఖ నివేదికల ప్రకారం రాష్ట్రంలో 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సీఎం జగన కే వలం 10 వేల పోస్టులతో జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేసి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నా రు. నిరుద్యోగులను ఆదుకునేందుకు వెంటనే జాబ్‌క్యాలెండర్‌ నోటిఫికేషన విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఐవైఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి రాము,  మోహనకృష్ణ, ధను, కుళ్లాయప్ప, శ్రీకాంత, ఏఐఎ్‌సఎఫ్‌ మోహనరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-25T05:52:59+05:30 IST