Abn logo
Jan 16 2021 @ 00:01AM

గుండెపోటుతో రిటైర్డ్‌ తహసీల్దార్‌ మృతి

రామాపురం, జనవరి15: మండలంలోని నల్లగుట్టపల్లె గ్రామం కొత్తపల్లెకు చెందిన విశ్రాంత తహసీల్దార్‌ సూరం వెంకట్రామిరెడ్డి (73) గుండెపోటుతో గురువారం రాత్రి 12.30 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతం రాయచోటి ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. శనివారం ఆయన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు, బంధుమిత్రులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement