‘ఆ ఆరుగురు నన్ను వేధిస్తున్నారు’ అంటూ వాట్సాప్ స్టేటస్... దీనిని చూసేలోగానే..

ABN , First Publish Date - 2022-07-12T14:41:17+05:30 IST

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో...

‘ఆ ఆరుగురు నన్ను వేధిస్తున్నారు’ అంటూ వాట్సాప్ స్టేటస్... దీనిని చూసేలోగానే..

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ రిటైర్డ్ సైనికుడు స్థానిక హోటల్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు మృతుడు తన వాట్సాప్‌లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్టేటస్‌లో పెట్టాడు. అయితే దీనిని అందరూ చూసేటప్పటికే ఘోరం జరిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మృతుడి బంధువులకు సమాచారం అందించారు. సికార్‌లోని దంతారామ్‌ఘర్ ప్రాంతానికి చెందిన కిషోర్ సింగ్ షెకావత్ కొన్నేళ్ల క్రితం ఆర్మీ నుంచి రిటైరయ్యారు. 


రెండు నెలలుగా బార్మర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కిషోర్ సింగ్ సూసైడ్ నోట్ రాశాడు. ఆరుగురు వ్యక్తులు తన చావుకు కారణమని దానిలో పేర్కొన్నాడు. తాను తీర్చాల్చిన డబ్బు ఇస్తానని చెబుతున్నప్పటికీ ఆ ఆరుగురు వ్యక్తులు తనను నిరంతరం బెదిరిస్తున్నారని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తన సోదరుడు కిషోర్ సింగ్ రిటైర్డ్ సైనికుడని మృతుడి సోదరుడు రాజ్‌పాల్ సింగ్ షెకావత్ తెలిపారు. బార్మర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, డబ్బుల వ్యవహారంలో అతడికి బెదిరింపులు వచ్చాయని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బర్మర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పద్మపురి తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేట్ హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలంలో మద్యం సీసా, విష పదార్థాల బాక్సు ఉన్నాయి. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. సూసైడ్ నోట్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-07-12T14:41:17+05:30 IST